: 3 నుంచి ఏపీ పాలన వెలగపూడి నుంచే.. దసరా నాడు సీఎం కార్యాలయం ప్రారంభం


ఆంధ్రప్రదేశ్ పాలన వచ్చే నెల మూడో తేదీ నుంచి వెలగపూడి నుంచి కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అక్టోబరు 3 నుంచి వెలగపూడి నుంచి పూర్తిస్థాయి పాలన కొనసాగుతుందని కార్యాలయాల తరలింపును పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 19 నుంచి నెలాఖరుకల్లా కార్యాలయాల తరలింపును పూర్తిచేస్తామని చెప్పారు. దసరా రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. శాఖల తరలింపు తర్వాత వారం పాటు ఉద్యోగులకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే సచివాలయ తరలింపు పూర్తయిన తర్వాత ఒక్కోశాఖ నుంచి ఒకరిద్దరు ఉద్యోగులు హైదరాబాద్‌ సచివాలయం నుంచే పనిచేస్తూ కోర్టు వ్యవహారాలు చూసుకుంటారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News