: పెరిగిన సిమెంట్ ధరలను తగ్గించాలని సీఎం చంద్రబాబుకు వినతి
ఏపీ సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (అప్రెడా) ప్రతినిధులు కలిశారు. సిమెంట్ ధరలు పెరగడంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. సిమెంట్ బస్తా ధర రూ.220 నుంచి రూ.330కి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.