: హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ‘బంగ్లా’ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హాసన్, ఆయన భార్య ఉమ్మె అహ్మద్ షిషిర్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈరోజు ఢాకా నుంచి రాయల్ టులీప్ సీ రిసార్ట్ కు షకీబల్ దంపతులను తీసుకెళ్లిన హెలికాప్టర్, వారిని దింపి వెనుదిరిగిన కొద్దిసేపటికే కూలిపోయింది. హెలికాప్టర్ లో పైలట్ సహా ఐదుగురు ఉన్నారు. ఇందులో ఒకరు మరణించగా, మిగిలినవారు గాయపడ్డారు. కాగా, తాను క్షేమంగా ఉన్నానని షకీబల్ ఒక ప్రకటన చేశాడు. ఒక వాణిజ్య ప్రకటన నిమిత్తం తాను షూటింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు.