: రెండు, మూడేళ్ల పాటు సినిమాలు చేయను: హీరో రోషన్


రెండు, మూడేళ్ల పాటు తాను సినిమాలు చేయనని ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం ద్వారా హీరో గా పరిచయమైన రోషన్ చెప్పాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం కథ బాగుందని చెప్పి ఈ చిత్రంలో నటించానని, ఇప్పట్లో వేరే సినిమాల్లో నటించనని చెప్పాడు. రెండు, మూడేళ్ల వరకు నటించే ప్రసక్తే లేదని అన్నాడు. ఒకవేళ, ఇప్పుడు అవకాశాలు వచ్చినా ఇదే తరహా సినిమాల్లో అవకాశాలొస్తాయని, అది తనకు ఇష్టం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ సినీ నటులవడంతో, వారి ఇంటర్వ్యూలు టీవీల్లో చూస్తుండేవాడినని, తాను కూడా ఆ స్థాయికి ఎప్పుడు ఎదుగుతానా అని అనుకుంటూ ఉండేవాడినని రోషన్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News