: ఈ టాయిలెట్ నిజంగా ‘బంగార’మే!


బంగారం పళ్లాలు, గ్లాసులు, పెన్నులు.. ఇలాంటి వాటి గురించి తరచూ వింటూనే ఉంటాము. మరి, బంగారు టాయిలెట్ గురించి ఎప్పుడైనా విన్నామా? అలాంటి టాయిలెట్ చూడాలంటే మాత్రం న్యూయార్క్ వెళ్లాల్సిందే. అక్కడి సోలోమన్ ఆర్.గుగ్గెన్ హీమ్ మ్యూజియంలో స్వచ్చమైన బంగారంతో తయారుచేసిన టాయిలెట్ ఉంది. ఇక్కడి నాల్గో అంతస్తులోని రెస్ట్ రూమ్ లో ఉన్న టాయిలెట్ స్థానే ఈ బంగారు టాయిలెట్ ను అమర్చారు. అమెరికా ఎగ్జిబిట్ లో భాగంగా దీనిని ఇటలీ కళాకారుడు మౌరిజియో కాటెలన్ తయారు చేశాడు. దీనిని సందర్శకులు చూసేందుకు అవకాశం కల్పించడమే కాదు, ఉపయోగించే వీలు కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ రోజు నుంచే ప్రదర్శన ప్రారంభమవడంతో, ఈ బంగారు టాయిలెట్ ను చూసేందుకు సందర్శకులు బారులు తీరుతున్నారు.

  • Loading...

More Telugu News