: హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. మ్యాన్ హోల్స్ తెరవవద్దన్న జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్‌ను ఈరోజు మరోసారి వర్షం ముంచెత్తింది. వర్షం బీభత్సానికి పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ఎర్రమంజిల్ వద్ద ప్రధాన రోడ్డు మార్గంలో మోకాళ్లలోతు నీరు నిండిపోయింది. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి స్పందించారు. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోల్స్ తెరవవద్దని సిబ్బందికి సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారని చెప్పారు.