: మెహిదీపట్నంలో నాలుగు కార్లు ఢీ.. ట్రాఫిక్ జాం!
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని పీవీ నర్సింహారావు ఫ్లై ఓవర్‌పై నాలుగు కార్లు ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా ఆ ఫ్లై ఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.