: పాక్ లోని మసీదులో ప్రార్థనలు జరుపుతున్న వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
పాకిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్ ప్రాంతంలోని మహమాండ్ ఏజెన్సీలో మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుపుతున్న ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. ఈ ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. మసీదు దగ్గరకు చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.