: నయీమ్ కేసులో తనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో కాసేపట్లో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మీడియా సమావేశం
తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో సిట్ బృందం వేగంగా దర్యాప్తు జరుపుతోంది. నయీమ్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మరికాసేపట్లో హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. నయీమ్ తో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆయన స్పష్టతనివ్వనున్నారు. ఈ కేసులో ఆయనను అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, నయీమ్ అక్రమాలతో తనకు ఏ సంబంధం లేదని కృష్ణయ్య ఇప్పటికే పలు టీవీ ఛానళ్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో చెప్పారు.