: తెలంగాణ ప్రజలు చంద్రబాబును క్షమించబోరు!: తెలంగాణ మంత్రి ఈటల
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే పనులను మానుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని పంట పొలాలకు నీరు అందకుండా చేసే లక్ష్యంతో ఢిల్లీలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారని ఈటల అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబును క్షమించబోరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే చేనేత కార్మికుల రుణాలని మాఫీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.