: కేసీఆర్ ఒక అవకాశవాది.. మాట తప్పారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సెప్టెంబర్ 17న తెలంగాణలో విమోచన దినం నిర్వహించాలని డిమాండ్ చేస్తోన్న టీపీసీసీ కేసీఆర్‌పై మండిపడింది. ఈరోజు సికింద్రాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఆ అంశంపై కేసీఆర్ మాట తప్పారని అన్నారు. కేసీఆర్ ఒక అవకాశవాదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఆనాడు తన రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలంటూ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఈ నెల 19న కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీపీ, కోఆపరేటీవ్ చైర్మన్లకు తాము శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందులో పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, దిగ్విజయ్ కుంతియా, పలువురు ఏఐసీసీ నేతలు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్‌లో ఉన్న లోపాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు.