: కావేరి జ‌లాల వివాదం: నాన్‌తమిళర్ పార్టీ కార్యకర్త విఘ్నేష్ ఆత్మ‌హ‌త్య‌


కావేరి జ‌లాల వివాదంలో నిర‌స‌న వ్య‌క్తం చేస్తోన్న‌ నాన్‌తమిళర్ పార్టీ కార్యకర్త విఘ్నేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. త‌మిళ‌నాడుకు అన్యాయం జ‌రిగిందంటూ నిన్న తంజావూరులో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న విఘ్నేష్ చెన్నైలోని కేఎంసీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. విఘ్నేష్ మృతితో స‌ద‌రు ఆసుప‌త్రి ముందు నాన్‌త‌మిళ‌ర్ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌కు దిగారు. పోస్టుమార్టం పూర్తి కాకుండానే ఆసుప‌త్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువుల‌ు ప్ర‌య‌త్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల‌కి, వారికి మ‌ధ్య‌ తోపులాట జరిగి ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. నామ్‌త‌మిళ‌ర్ పార్టీ నేత‌లు రేపు కూడా బంద్ నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News