: 72 అడుగుల డూండీ గణేశ్ నిమజ్జనంలో అపచారం
డూండీ గణేశ్ సేవా సమితి విజయవాడలో 72 అడుగుల భారీ గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచిన ఈ వినాయకుడిని 11 రోజుల పాటు లక్షలాది మంది దర్శించుకున్నారు. ఉన్నచోటే విగ్రహం కరిగిపోయి నిమజ్జనం అయ్యేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి నిన్న నిమజ్జన కార్యక్రమం చేశారు. అయితే, ఈ నిమజ్జనం అసంపూర్తిగా మారినట్లు తెలుస్తోంది. విగ్రహం పూర్తిగా కరగలేదు. నీళ్లు లేకపోవడంతో కూలీలతో మట్టిని తొలగించే యత్నం చేస్తున్నట్లు సమాచారం. నిర్వాహకుల తీరుపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.