: దేవినేని తొలుత వైసీపీలో చేరాలని చూశారు, పిల్లకాకితో వెళ్లొద్దని చెప్పా: జలీల్ ఖాన్
నిన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దేవినేని నెహ్రూ, తొలుత వైకాపాలో చేరాలని ప్రయత్నించారట. ఈ విషయాన్ని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఒక దశలో నెహ్రూ వైకాపా నేతలను కలిసే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో "పిల్లకాకితో వెళితే నష్టపోతావు" అని చెప్పి, ఆయన ఆలోచనను మార్చానని జలీల్ తెలిపారు. నెహ్రూకు ఉన్న రాజకీయ అనుభవం ముందు వైసీపీ ఎంతని ప్రశ్నించిన ఆయన, టీడీపీలో ఆయన చేరికను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని తెలిపారు. వైకాపాను వీడినందుకు తనకు రూ. 30 కోట్లు ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఆయన, తనకు 30 పైసలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.