: 3న కోర్టుకు రండి... కేసీఆర్, కేటీఆర్ లకు ఒంగోలు కోర్టు నోటీసు
అక్టోబర్ 3వ తేదీన ఒంగోలు కోర్టుకు హాజరు కావాలని తెలంగాణ సీఏం కేసీఆర్ సహా పలువురికి నోటీసులు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజనకు పూర్వం నమోదైన కేసు విచారణలో భాగంగా, ఈ మేరకు 7వ అడిషనల్ జడ్జి నోటీసులు పంపారు. ఆంధ్రులను అవమానపరిచేలా కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్, ఈటెల, కోదండరాం తదితరులు ప్రసంగాలు చేశారని, దీనివల్ల తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని అద్దంకి నివాసి వేజండ్ల సుబ్బారావు వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అంతకుముందు ఇదే పిటిషన్ ను అద్దంకి కోర్టులో దాఖలు చేయగా, దాన్ని స్వీకరించేందుకు న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఆయన జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు.