: మరో దీక్షకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి మరో దీక్షకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఈ నెల 19, 20 తేదీల్లో తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన రైతు దీక్షకు దిగనున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ఆయన ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఇదివరకు దీక్ష చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న భూసేకరణ విధానానికి నిరసనగా ఆయన మరోసారి ఈ దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. భూసేకరణతో పాటు మహారాష్ట్రతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న నీటి ఒప్పందాలపై ఆయన దీక్ష ద్వారా నిరసన తెలపనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవుతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.