: బస్సు ప్రమాద ఘటనపై అనుమానాలు.. ఆరా తీసిన తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి
హుమ్నాబాద్ గుండా వెళుతోన్న షిర్డీ-హైదరాబాద్ బస్సులో ఈరోజు తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంలో తణుకుకు చెందిన విహాన్(6) సజీవదహనమయ్యాడు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ప్రయాణికులను సమీప దాబా సిబ్బంది రక్షించారు. పోలీసులు ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని చెబుతున్నప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద ఘటనపై తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. అధికారులకు ఫోన్ చేసి బస్సు ప్రమాదంపై ఆరా తీశారు. ఏసీ షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని పోలీసు అధికారులు మహేందర్‌రెడ్డికి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. మరోవైపు కావేరీ ట్రావెల్స్ నిర్వాహకులు హైదరాబాద్ నుంచి హుమ్నాబాద్ కు బయలుదేరారు. బస్సు ప్రమాద ఘటనపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ అధికారులతో మాట్లాడుతున్నారు.