: శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ రాజకీయ ప్ర‌ముఖులు


తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి సేవలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ చీఫ్ విప్‌ కాల్వ శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు ఆప‌ద‌మొక్కుల వాడిని ద‌ర్శించుకున్నారు. ఇరువురికీ స్వాగతం పలికిన టీటీడీ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేసి, శ్రీ‌వారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో పరకాల ప్ర‌భాక‌ర్ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ఏపీకి చేస్తోన్న సాయంలో త‌మ‌కు ఏమ‌యినా లోటు ఉన్నట్లు అనిపిస్తే తాము రాజీ ప‌డ‌కుండా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News