: ఎవరూ నిప్పంటించలేదు... షార్ట్ సర్క్యూట్ తోనే ఘోరం: బీదర్ ఎస్పీ


కర్ణాటక పరిధిలో గురువారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సుకు ఎవరూ నిప్పంటించలేదని, బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఘోరం జరిగిందని బీదర్ ఎస్పీ నికమ్ ప్రకాశ్ అమ్రీత్ వెల్లడించారు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారని, నలుగురికి గాయాలు అయ్యాయని, ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఘటన విషయం తెలియగానే అధికారులు స్పందించారని తెలిపిన ఆయన, ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని అన్నారు. ఆరోపణలు వస్తున్నట్టుగా ఎవరైనా నిప్పంటించారా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించిన తరువాతనే వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. కొందరు కన్నడ ఆందోళనకారులు బస్సు రిజిస్ట్రేషన్ పుదుచ్చేరి పేరిట ఉండటాన్ని చూసి బస్సుకు నిప్పు పెట్టారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరిగిందన్నది వెల్లడి కావాల్సివుంది.

  • Loading...

More Telugu News