: మంటల్లో కావేరీ ట్రావెల్స్ బస్సు... కర్ణాటకలో తెలుగు యువకుడి సజీవ దహనం
కావేరీ నదీ జలాల వివాదంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న కర్ణాటకలో ఘోరం జరిగింది. అనుమానాస్పద పరిస్థితుల్లో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రయాణికులు లోపలుండగానే బస్సు మంటల్లో అంటుకోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ సజీవ దహనం అయ్యాడని సమాచారం. బస్సులో చాలా మంది ఉండగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. వీరిలో పాటిల్ అనే పోలీసు అధికారి కూడా ఉన్నట్టు తెలిసింది. గాయపడ్డ వారి పరిస్థితిపై పూర్తి సమాచారం అందాల్సివుంది. కాగా, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగివుండవచ్చని భావిస్తున్నట్టు కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.