: తిరుపతి ఘాట్ రోడ్డులో ప్రమాదం.. భక్తులకు గాయాలు


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు కారులో తిరుమలపైకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. 30 మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అందులోని భక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే కారును తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు.

  • Loading...

More Telugu News