: పద్ధతి గల దొంగలు.. తామేం దొంగిలించిందీ రాసిపెట్టి వెళ్లారు!


దొంగల్లోనూ పద్ధతి గల దొంగలుంటారనడానికి ఇదో చక్కని ఉదాహరణ. ఇంట్లోకి చొరబడి కనిపించిన నగదు, వస్తువులను దోచుకెళ్లే దొంగలు.. తామేం దొంగిలించిందీ రాసిపెట్టి మరీ వెళ్తే! అది వింతకాకపోతే మరేంటి? అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఈ విచిత్ర దొంగతనం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ప్లే స్టేషన్, ల్యాప్‌టాప్ సహా మరికొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు. తిరిగి వెళ్తూ వెళ్తూ తాము దొంగలించిన వస్తువుల వివరాలను ఓ పేపర్‌పై రాసి పెట్టి మరీ వెళ్లారు. ఇంటికొచ్చిన యజమాని జోసెఫ్ అల్వారాడో లోపల ఉన్న చిట్టీలు చూసి ఆశ్చర్యపోయారు. ‘‘నేను లోపలికి వచ్చా. నీ పీఎస్ 3, కంట్రోలర్స్, గేమ్స్, కంప్యూటర్ తీసుకెళ్లా. బై ఎ కిడ్ హ..హ్హ..హ్హ..’’ అని ఆ చిట్టీల్లో రాసి ఉంది. దానిని ఎవరో చిన్నపిల్లలే రాసి ఉంటారని, స్పెల్లింగ్‌ తప్పులు ఉన్నట్టు టీచర్ అయిన జోసెఫ్ తెలిపారు. ఈ దొంగతనాన్ని తప్పకుండా పిల్లలే చేసి ఉంటారని ఆయన చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News