: నేను ఎక్కడికి వెళ్లినా ఆయన గొంతునే అనుకరించమంటారు: హాస్యనటుడు శివారెడ్డి


‘నేను ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.సత్యనారాయణరావు గారి గొంతును అనుకరించి మాట్లాడమని అభిమానులు అడుగుతుంటారు’ అని ప్రముఖ హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తెలిపారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కాంగ్రెస్ నేత ఎం.సత్యనారాయణరావు గారి వాయిస్ ను ఇమిటేట్ చేయమని చాలా మంది అడుగుతుంటారు. సత్యనారాయణరావు గారు, నేను కలిసిన సందర్భాల్లో కూడా ఆయన తన వాయిస్ ను వినిపించమని నన్ను అడిగేవారు. సత్యనారాయణరావుగారి కూతురు ఒకసారి ఎయిర్ పోర్ట్ లో కలిసినప్పుడు, మరోసారి ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా తన తండ్రి మాట్లాడినట్లు మాట్లాడమని అడిగారు. ‘మా నాన్నగారు మాట్లాడినట్లే మీరు మాట్లాడతారు’ అని ఆమె చాలాసార్లు నాతో చెప్పారు. హీరో రాజశేఖర్ గారు నటించిన ‘సత్యమేవ జయతే’ సినిమాలో సీఎం క్యారెక్టర్ ను సత్యనారాయణరావుగారు పోషించారు. ఈ చిత్రంలో ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పింది నేనే. చాలామంది సత్యానారాయణరావు గారే డబ్బింగ్ చెప్పారనుకున్నారు. చివరకు, ఆయన కూతురు కూడా అలాగే అనుకున్నారట. వాళ్ల నాన్న చెప్పే దాకా ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెప్పానని ఆమెకు తెలియదు’ అని శివారెడ్డి చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News