: చాలా ఆనందంగా పుట్టినరోజు జరుపుకున్నా: రమ్యకృష్ణ
కుటుంబసభ్యుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు ఆనందంగా జరుపుకున్నానని ప్రముఖ నటి రమ్యకృష్ణ తెలిపింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. ప్రముఖ దర్శకుడు, భర్త కృష్ణవంశీ తదితరులతో కలిసి కేక్ కట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తమ దివ్యమైన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ రమ్యకృష్ణ థ్యాంక్స్ చెప్పింది. ‘బాహుబలి-2’, ‘శభాష్ నాయుడు’, ‘జాగ్వార్’ తదితర చిత్రాల్లో ప్రస్తుతం ఆమె నటిస్తోంది.