: దేవినేని నెహ్రూకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు


విజయవాడ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని నెహ్రూ కొద్ది సేపటి క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దేవినేని నెహ్రూతో పాటు అవినాష్, బుచ్చిబాబులకు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కళా వెంకట్రావు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. దేవినేని నెహ్రూతో పాటు పలువురు మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ గుణదలలో జరిగిన ఈ సభకు దేవినేని వర్గీయలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

  • Loading...

More Telugu News