: నా చేతికి వాచీ లేదు, నా జేబులో డబ్బూ ఉంచుకోను: సీఎం చంద్రబాబునాయుడు
‘నా చేతికి వాచీ లేదు. నా జేబులో డబ్బు కూడా ఉంచుకోను’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయ భవనాలను పరిశీలించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సింది డబ్బు కాదని, ప్రజల గుండెల్లో పదిలమైన స్థానమని, ప్రజల కోసమే తాను పనిచేస్తానని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తాను భయపడనని అన్నారు. ‘టీడీపీకో పేరుంది, తనకో బ్రాండ్ ఉంది’ అని చంద్రబాబు అన్నారు.