: అదృష్టవశాత్తూ ఇప్పటికీ అవకాశాలొస్తున్నాయి: అమితాబ్ బచ్చన్
నటించడమంటే తనకు ఇష్టమని, క్యారెక్టర్ లేదా ఇతర పాత్రల్లోనైనా నటిస్తానని, అదృష్టవశాత్తు, ఇప్పటికీ తనకు అవకాశాలొస్తున్నాయని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. అమితాబ్ నటించిన తాజా చిత్రం ‘పింక్’ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ, ప్రతి సినిమా తనకు ఒక పరీక్ష లాంటిదని, ‘పింక్’ షూటింగ్ సమయంలో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపానని చెప్పారు. నలభై ఏళ్ల క్రితం తాను నటించేటప్పుడు ఎంత ఆత్రుతతో ఉండేవాడినో, ఇప్పుడూ అలానే ఉన్నానని, జీవితంలో సులభంగా ఏదీ మన దరిచేరదని అమితాబ్ చెప్పుకొచ్చారు.