: చిన్నిచిన్ని పాదాలతో రెండేళ్ల వయసులోనే స్టెప్పులేస్తున్న జెనీలియా కుమారుడు
'బొమ్మరిల్లు' సినిమాలో ‘హాసిని’ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్ దంపతులకు రెండేళ్ల కుమారుడు ‘రియాన్’ ఉన్న సంగతి తెలిసిందే. రితేష్ హీరోగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘బాంజో’ చిత్రం ట్రైలర్‌తో పాటు కొన్ని సాంగ్స్‌ను ఆ చిత్రం బృందం ఇటీవలే విడుదల చేసింది. అలాగే, తాజాగా ఈ చిత్రం టీమ్ ఓ పాట మేకింగ్ వీడియోను అభిమానుల ముందుంచింది. అందులో రియాన్ అదిరిపోయే స్టెప్పులేస్తూ జెనీలియా, రితేశ్ ల అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. రియాన్ డ్యాన్స్ చూస్తూ రితేష్, జెనీలియా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.