: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 28,412 పాయింట్ల వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 8,742 పాయింట్ల వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో బీహెచ్ఈఎల్, జీ ఎంటర్ టైన్ మెంట్, రిలయన్స్, మారుతి సుజుకీ, ఐటీసీ లిమిటెడ్ షేర్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.66.97 వద్ద కొనసాగుతోంది.