: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్


ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ హిక్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. త్వరలోనే ఆస్ట్రేలియా టీమ్ సౌత్ ఆఫ్రికాతో ఓ సిరీస్‌ ఆడ‌నుంది. ఈ క్ర‌మంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆయ‌న‌ను బ్యాటింగ్ కోచ్గా నియ‌మించింది. ఇంగ్లండ్ తరపున అంత‌ర్జాతీయ క్రికెట్‌ సిరీస్‌ల‌లో పాల్గొన్న‌ గ్రేమ్‌ హిక్ ను 2013లో క్రికెట్ ఆస్ట్రేలియా హై పెర్ఫామెన్స్ కోచ్ గా కూడా నియ‌మించింది. బ్యాటింగ్‌ కొత్త కోచ్‌గా గ్రేమ్ హిక్‌ను నియ‌మించిన నేప‌థ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు ప్రధాన కోచ్ డారెన్ లీమన్ స్పందిస్తూ... క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆస్ట్రేలియా టీమ్‌ను మరింత ముందుకు తీసుకెళుతుంద‌ని పేర్కొన్నారు. ఇటీవల వెస్టిండీస్తో ఆసిస్ ఆడిన వన్డే సిరీస్లో హిక్ తమతో క‌లిసి ప‌నిచేశాడ‌ని ఆయ‌న అన్నారు. ఆ సిరీస్ సంద‌ర్భంగా హిక్ తమను ఎంతగానో ఆకట్టుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. హిక్‌కు ఉన్న అనుభ‌వం త‌మ జ‌ట్టుకెంతో మేలు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌మ జ‌ట్టు పాల్గొన‌నున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, యాషెస్ సిరీస్ వంటి అన్ని సిరీస్‌ల్లోనూ హిక్ జ‌ట్టుకి ఇచ్చే సలహాలు త‌మ‌కు ఎంతో మేలు చేస్తాయ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News