: నాగార్జునగారి తో నటిస్తున్నప్పుడు కొంచెం నెర్వస్ గా ఫీలయ్యాను: సినీ హీరో రోషన్
‘నిర్మలా కాన్వెంట్ చిత్రం షూటింగ్ సమయంలో నాగార్జున గారితో కలిసి నటిస్తున్నప్పుడు మొదట్లో చాలా నెర్వస్ గా ఫీలయ్యాను. ఎందుకంటే, ఆయన పెద్ద నటుడు కదా’ అన్నాడు కొత్త హీరో రోషన్. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నాగార్జునగారి ముందు నటించేటప్పుడు నెర్వస్ గా ఫీలైన విషయాన్ని మా నాన్నకు చెప్పాను. ‘ఏమీ వర్రీ కాకు. కెమెరా ఆన్ అయిన తర్వాత ఆర్టిస్టులు ఆర్గిస్టులే. డూ యువర్ బెస్ట్’ అని నాన్న అన్నారు. నాగార్జునగారు కూడా చాలా ఇంటరాక్టు అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నెర్వస్ నెస్ పోయి, మామూలుగా నటించాను. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అమ్మానాన్నలిద్దరూ రాలేదు. కాకపోతే, బ్రేక్ టైంలో ఓసారి నాన్న వచ్చారు’ అని రోషన్ చెప్పుకొచ్చాడు.