: రాజీనామా చేయనున్న శ్రీనగర్ ఎంపీ తారిక్


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వ‌నీ హ‌త‌మైన అనంత‌రం కశ్మీర్ లోయలో త‌లెత్తిన క‌ల్లోల‌ ప‌రిస్థితుల‌ను చ‌ల్లార్చ‌డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ ఆ రాష్ట్ర‌ అధికార పీడీపీ సీనియర్ నేత, శ్రీనగర్ ఎంపీ తారిక్ కార్రా రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. గ‌త కొంత కాలంగా బీజేపీతో త‌మ పార్టీకి ఉన్న మిత్ర‌త్వంపై కూడా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌శ్మీర్‌లోయ‌లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న రాజీనామా చేస్తానంటూ చేసిన‌ ప్ర‌క‌ట‌నతో అధికార పీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

  • Loading...

More Telugu News