: భార్య ముక్కును కొరికేసిన అనుమానపు భర్త
భార్యమీద అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి అనుమానపు పిశాచిగా మారి ఆమె ముక్కుని కొరికేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. కొంత కాలంగా తన భార్య కమలేశ్‌పై అనుమానాన్ని పెంచుకుంటూ వస్తోన్న సంజీవ్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిన్న తన భార్య ఫోనులో మాట్లాడుతుండడాన్ని గమనించిన సంజీవ్ ఫోనులో ఎవరితో మాట్లాడావంటూ గొడవ పెట్టుకున్నాడు. దీంతో మరింత ఆగ్రహం తెచ్చుకొని తన భార్య అందంగా కన్పించకూడదనే ఉద్దేశంతో అమాంతం ఆమె ముక్కు కోరికేసి, ఇంటి నుంచి పరారయ్యాడు. ముక్కు తెగి గాయాలపాలయిన కమలేశ్‌ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.