: బప్పీలహరి బంగారు గొలుసులు ధరించడానికి కారణం అదన్నమాట!
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి మ్యూజిక్ ఎంత ఫేమస్ అయిందో, మెడ నిండా రకరకాల బంగారు గొలుసులు ధరించే ఆయన కూడా అంతే పేరు సంపాదించుకున్నారు. బంగారు గొలుసులు ధరించడానికి గల కారణాన్ని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికన్ రాక్ స్టార్ ఎల్విస్ ప్రెస్లీ కి బప్పీలహరి వీరాభిమాని. ఎల్విస్ ప్రెస్లీ కూడా రకరకాల బంగారు గొలుసులు వేసుకునేవాడని, ఏదోఒక రోజు తాను కూడా అంతటి వాడిని కావాలని, తన కంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ విధంగా గొలుసులు ధరిస్తుంటానని బప్పీలహరి చెప్పారు. అయితే, తాను ఈ గొలుసులు వేసుకుని పోజ్ కొడుతున్నానంటూ అప్పట్లో కొందరు కామెంట్స్ చేసేవారని నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. బంగారు ఆభరణాలు ధరించడం వల్ల తనకు బాగా కలిసొచ్చిందని అన్నారు. ప్రస్తుతం బంగారం, ప్లాటినం, వెండి కలిపి తయారు చేసిన ల్యూమినెక్స్ యూనో ఆభరణాలే వాడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను అంతర్జాతీయ పాప్ సింగర్లు జూలియా ప్రైస్, ఏకాన్, స్పూప్ డాగ్ లతో కలిసి పనిచేస్తున్నానని బప్పీలహరి చెప్పారు.