: భక్తులను మైమరపిస్తున్న మంచు వినాయకుడు


మట్టితో, కూరగాయలతో, పచ్చగడ్డితో, కొబ్బరికాయలతో, పండ్లతో... ఇలా రకరకాల గణనాథులను భక్తులు తయారు చేయడం మనకు తెలుసు. కానీ, మంచు వినాయకుడి గురించి తెలియదు. ముంబయిలోని స్నో వరల్డ్ థీమ్ పార్క్ నిర్వాహకుల ఆలోచనా ఫలితమే ఈ మంచు విఘ్నేశ్వరుడి రూపకల్పన. అభయ్, సుశాంత్ అనే ఇద్దరు కళాకారులు మంచు వినాయకుడికి ప్రాణం పోశారు. ఇందుకుగాను సుమారు 300 కిలోల మంచుతో 5.5 మీటర్ల ఎత్తులో తయారు చేసిన ఈ గణనాథుడు కరిగిపోకుండా మండపంలో -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేశారు. మంచు గణనాథుడిని తయారు చేసేందుకు 10 నుంచి 15 రోజుల పాటు శ్రమించినట్లు కళాకారులు పేర్కొన్నారు. కాగా, ఈ మంచు వినాయక విగ్రహాన్ని దర్శించుకోవడం తమకు కొత్త అనుభూతిని కల్గిస్తోందని, చాలా సంతోషంగా ఉందని భక్తులు, సందర్శకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News