: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుకలో అపశ్రుతి
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వర్షంలోనూ ట్యాంక్ బండ్ వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. అయితే నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని తరలిస్తున్న సమయంలో నగరంలోని బంజారాహిల్స్, వెంకటేశ్వర నగర్‌లోని రోడ్ నెం.14 లో అపశ్రుతి చోటుచేసుకుంది. గణనాథుడి విగ్రహాన్ని క్రేన్ ద్వారా పైకి లేపుతుండగా విగ్రహం ఒక్కసారిగా కూలింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.