: రంగారెడ్డి జిల్లా థారూర్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా థారూర్‌లో ఈరోజు రికార్డు స్థాయిలో 109.5 మి.మీ వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు.