: స్విస్ ఛాలెంజ్‌పై హైకోర్టులో విచారణ
ఏపీ నవ్యరాజధాని అమరావతి నిర్మాణంలో స్విస్ ఛాలెంజ్ విధానంపై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇటీవలే తాత్కాలిక స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో చిక్కుల్లో పడ్డ ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్ కి దాఖలు చేసిన అపీలుపై ఈరోజు విచారణ జరుగుతోంది. సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ అడ్వొకేట్ జనరల్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిన్న వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సాధారణ అప్పీలు చేసుకుంది.