: దుకాణంలోనే తగలబడిన ఐప్యాడ్‌ బ్యాటరీ.. బయటకు పరుగులు తీసిన కస్టమర్లు


వినియోగదారులు వాడుతుండగా ఐప్యాడ్‌ బ్యాటరీలు వాటంతట అవే తగలబడిపోయి ప్రమాదానికి కారణమవుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఫిన్‌లాండ్‌లోని రొవానీమిలో ఫోన్లు విక్రయించే ఓ దుకాణంలో ఐప్యాడ్‌ బ్యాటరీ కాలిపోవడం అలజడి రేపింది. బ్యాటరీలో అకస్మాత్తుగా మంటలు వచ్చి భారీగా పొగ వ్యాపించింది. దీంతో దుకాణంలోని సిబ్బంది, కస్టమర్లు ఆందోళ‌న‌కు లోన‌య్యారు. షాపులోంచి బ‌య‌ట‌కు పరుగులు తీశారు. రెండేళ్ల నుంచి వినియోగిస్తోన్న ఐప్యాడ్ బ్యాటరీని మార్చుకునేందుకు ఓ వినియోగ‌దారుడు షాపుకి వచ్చాడు. ఆ సందర్భంగా బ్యాటరీ మార్చుతుండగా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News