: ఒక్క దండ, బొకే కూడా నాకొద్దు, ఆ డబ్బుతో ఎవరికైనా పట్టెడన్నం పెట్టండి: మోహన్ బాబు
నాలుగు దశాబ్దాల నటజీవితాన్ని పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబును, 'నవరస నటతిలకం' బిరుదుతో టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ సత్కరించనున్న వేళ, మోహన్ బాబు విశాఖపట్నం చేరుకున్నారు. తన గురువు దాసరితో పాటు అభిమానుల అండదండలతోనే ఇంతటివాడిని అయ్యానని చెప్పిన ఆయన, తన అభిమానులు భారీ ఎత్తున విశాఖకు తరలి వస్తున్నారని అన్నారు. విశాఖకు వచ్చే అభిమానులు పూలదండలు, బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బుతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టాలని, అదే తానెంతో సంతోషించే విషయం అవుతుందని అన్నారు. ఈ 40 సంవత్సరాలూ ఎలా గడిచిపోయాయో తెలియడం లేదన్న మోహన్ బాబు, ఇప్పుడు తనతో పనిచేసిన వారంతా వచ్చి అభినందనలు చెబుతుంటే వాటిని స్వీకరిస్తూ, ఆనందంగా ఉన్నానని చెప్పారు.