: కడప జిల్లాలో ఘాతుకం.. నిద్రిస్తున్నవారిని చంపిన దుండగులు
కడప జిల్లా ప్రొద్దుటూరు, కోనేటికాలనీలో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై వేటకొడవళ్లతో దాడి చేశారు. నిద్రపోతున్న వారి గొంతులుకోసి పారిపోయారు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.