: ఆంధ్రయూనివర్సిటీలో కలకలం.. చెడు వ్యసనాలకు బానిసై విద్యార్థి ఆత్మహత్య
విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీ హాస్టల్‌లో న్యాయ విద్యార్థి యశస్వి కిటికీకి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది. ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని మమతా హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో యశస్వి ఆత్మహత్య లేఖను రాసిపెట్టాడు. అందులో తాను చెడు వ్యసనాల బారిన పడినట్లు, దాంతో తాను ఎంతో మనస్తాపం చెందుతున్నట్లు పేర్కొన్నాడు. నిన్న అర్ధరాత్రి వరకు యశస్వి ఉంటున్న గదిలోనే అతడి స్నేహితులు ఉన్నారు. అయితే కరెంటు పోవడంతో వారు హాస్టల్ బిల్డింగ్‌పైకి వెళ్లారు. యశస్వి మాత్రం గదిలోనే ఉండిపోయి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.