: ముద్రగడతో ప్రత్యేక చర్చలు జరపనున్న దాసరి

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలసి ప్రత్యేకంగా చర్చించాలని దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్ణయించుకున్నారు. ఈమేరకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి వెళ్లి, ఆయన ఇంట్లోనే కాపుల స్థితిగతులు, ప్రభుత్వంపై తీసుకురావాల్సిన ఒత్తిడి తదితరాలపై వ్యూహ రచన సాగించనున్నట్టు దాసరి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దాసరి రేపు కిర్లంపూడికి బయలుదేరి వెళతారని తెలుస్తోంది. వెనుకబడిన తరగతుల్లో కాపులను చేర్చేందుకు శ్రమిస్తున్న ముద్రగడ వెనుకే తామంతా ఉన్నామని ఇటీవల దాసరి నారాయణరావు వెల్లడించిన సంగతి తెలిసిందే.