: గత రెండేళ్ల నుంచి బాలాపూర్ లడ్డూ కోసం ఎదురుచూస్తున్నాను!: స్కైలాబ్ రెడ్డి
ప్రతి ఏటా వేలంపాటలో తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ వస్తోన్న బాలాపూర్ గణేశ్ లడ్డు ఈ ఏడాది కూడా అదే దూకుడును కనబరిచింది. ఈ ఏడాది వేలంలో రూ.14.65 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు ధర పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లడ్డూని సొంతం చేసుకున్న భక్తుడు స్కైలాబ్ రెడ్డి మాట్లాడుతూ... లడ్డూను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. గత రెండేళ్ల నుంచి బాలాపూర్ లడ్డూ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు ఇటువంటి అవకాశం దొరకడం ఎంతో అదృష్టమని పేర్కొన్నారు. తమ గ్రామంలో అందరికీ లడ్డూను అందించనున్నట్లు చెప్పారు. లడ్డూను సొంతం చేసుకున్నందుకు తనకు ఇప్పుడు ఎంతో తృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. గణేశుడి ఆశీస్సులతోనే తన కల నెరవేరిందని చెప్పారు.