: సోషల్ మీడియా వైరల్... ఈ పజిల్ లోని 12 చుక్కలనూ ఒకేసారి చూడగలరా?


ఆప్టికల్ ఇల్యూజన్ నేపథ్యంలో ఇంటర్నెట్ ను ముంచెత్తుతుందో పజిల్. గ్రే కలర్ లో వర్టికల్, హారిజాంటల్, డయాగనల్ లైన్స్ ఉండగా, కార్నర్ జంక్షన్స్ లో, మధ్యలో బ్లాక్ డాట్స్ ఉన్నాయి. మొత్తం 12 బ్లాక్ డాట్స్ ఉండగా, వాటన్నింటినీ ఒకేసారి చూడగలరా? అన్నదే ప్రశ్న. అదేంటి బొమ్మ ఏదైనా మొత్తాన్ని ఓకేసారి చూడవచ్చు కదా అని అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. ఈ చిత్రం మొత్తాన్నీ చూస్తుంటే, మీకు కేవలం రెండు చుక్కలు మాత్రమే కనిపిస్తాయి. ఇక బొమ్మ మొత్తాన్ని ఓ తెల్ల కాగితంతో మూసేసి ఒక చివర్లో చూస్తే ఆ లైన్లో ఉన్న నాలుగు చుక్కలనూ చూడవచ్చు. ఈ పజిల్ ను సైకాలజీ ప్రొఫెసర్ అకియోషి కిటయోకా తన ఫేస్ బుక్ ఖాతాలో 11వ తేదీన పోస్టు చేయగా, 12న ట్విట్టర్ లోకి వచ్చి ఇప్పటికి 33,600 మందితో రీట్వీట్ చేయించుకుంది.

  • Loading...

More Telugu News