: రూ. 14.65 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ... ఆల్ టైం రికార్డు


వరుణుడి చిరు జల్లుల మధ్య బాలాపూర్ గణేషుడి చేతిలోని ప్రసాదం వేలం పూర్తయింది. వేలం పాటలో లడ్డూను రూ. 14.65 లక్షలకు స్కైలాబ్ రెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఇది ఆల్ టైం రికార్డు. ఈ ఉదయం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం లడ్డూ వేలాన్ని నిర్వహించారు. నలుగురు స్థానికేతరులు సహా మొత్తం 25 మంది లడ్డూను వేలం పాడేందుకు పోటీ పడ్డారు. వీరిలో పలువురు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. లడ్డూ ధర ఒక్కో లక్షా పెరుగుతుంటే భక్తులు ఆనందంతో కేరింతలు కొట్టారు. గత సంవత్సరం రూ. 10.32 లక్షలకు లడ్డూను ఓ భక్తుడు పాడుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News