: శోభాయాత్రను నడిపించేందుకు కదిలిన మహా గణపతి... సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తున్న ప్రజలు!


పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు ఫలించాయి. ముందు తిరుపతి బాలాజీ, గోవర్థన గిరిధారి రూపంలోని కృష్ణుని ప్రతిమలు సాగుతుండగా, శోభాయాత్రకు సారథ్యం వహించేందుకు ఖైరతాబాద్ మహాగణపతి బయలుదేరాడు. ఊరేగింపును చకచకా ముందుకు తీసుకెళుతున్న పోలీసులు, మీరా థియేటర్ (ఇప్పుడు సెన్సేషన్) సమీపానికి తీసుకువచ్చారు. బాలాపూర్ వినాయక విగ్రహం పాతబస్తీ దాటి వచ్చేటప్పటికి ఖైరతాబాద్ గణనాథుడు సెక్రటేరియేట్ మార్గంలోకి చేరుకుంటాడని అధికారులు వెల్లడించారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ నిమజ్జనం ఎంతో ఆలస్యంగా సాగడాన్ని ప్రతియేటా తిలకిస్తుండే ప్రజలు, ఇంత వేగంగా కదులుతుండటాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. తమ జీవితంలో మధ్యాహ్నానికే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని నిమజ్జనం ఎప్పుడూ చూడలేదని ఇక్కడివారు చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News