: వర్షాలకు ధ్వంసమైన వికారాబాద్ రైలు మార్గం... దారిమళ్లనున్న రైళ్లివే!


గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ - పర్లి మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసం కాగా, పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ప్రధాన రైళ్లను ముద్ఖేడ్ నుంచి నిజామాబాద్ మీదుగా మళ్లిస్తున్నట్టు వివరించారు. షిరిడీ నుంచి విజయవాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు, పుణె - హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, ఔరంగాబాద్ - హైదరాబాద్ పాసింజర్ రైళ్లు నిజామాబాద్ మీదుగా నడుస్తాయని తెలిపారు. బీదర్ - హమ్నాబాద్ ల మధ్య తిరిగే డెమో రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News