: ఆ ముదుసలిని ‘స్వచ్ఛభారత్’ చిహ్నంగా ప్రకటించనున్న కేంద్రం!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛభారత్’ చిహ్నంగా ముదుసలి కున్వర్ బాయి చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఈ నెల 17న ‘స్వచ్ఛ దివస్’ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని ఆ ముదుసలిని సన్మానించనున్నారు. కాగా, ‘స్వచ్ఛభారత్’ చిహ్నంగా కున్వర్ బాయిని ఎందుకు ఎంపిక చేశారంటే... ఛత్తీస్ గడ్ కు చెందిన ఆమె వయసు 105 సంవత్సరాలు. ‘స్వచ్ఛభారత్’ నేపథ్యంలో తన ఎనిమిది మేకలను అమ్మి వేసిన ఆమె, ఆ డబ్బుతో మరుగుదొడ్డి నిర్మించింది. ‘స్వచ్ఛభారత్’ స్ఫూర్తిని ఆమె తన వరకే పరిమితం చేసుకోలేదు. చుట్టుపక్కల వారికి దీనిపై అవగాహన కల్పించింది. గతంలో ఒకసారి ఛత్తీస్ గఢ్ వెళ్లిన ప్రధాని మోదీ, ఈ విషయం తెలసుకుని ఆమెను అభినందించారు.. ఆమె పాదాలకు నమస్కరించారు.