: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి మాతృవియోగం
కరీంనగర్ జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సమితి నేత చెన్నమనేని రమేశ్‌బాబు తల్లి లలితాదేవి ఈరోజు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు మృతి చెందారు. నాలుగు నెలల క్రితమే రమేశ్‌బాబు తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. సీనియర్ రాజకీయ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న చెన్నమనేని రాజేశ్వరరావు భార్య లలితాదేవి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజేశ్వరరావు 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తన కొడుకు రమేశ్‌బాబుకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేలా చేశారు. ఆయన సోదరుడు విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.